కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) మండల పరిధిలోని లింగాపూర్‌లో హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన చంద్రయ్య (50) అనే వ్యక్తి స్థానిక కొమ్మన్ చెరువులో అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. చంద్రయ్య మృతిపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రయ్యది సహజ మరణం కాదని, ఎవరో కావాలనే ఆయనను హత్య చేసి, ఆధారాలు లభించకుండా ఉండటానికి మృతదేహాన్ని చెరువులో పడేశారని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నర్సాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలిచే పంట ఇదే: మంత్రి తుమ్మల
Follow Us On : WhatsApp

