ఫిఫా వరల్డ్ కప్.. అత్యంత సంచలన క్షణాలు ఇవే!

కలం, స్పోర్ట్స్: ఫిఫా – 2026 వరల్డ్ కప్ (FIFA World Cup) సాంప్రదాయ ఫుట్ బాల్ దిగ్గజాలకు గట్టి సవాల్ విసిరింది. 48 జట్ల కొత్త ఫార్మాట్ తో సాగిన ఈ మెగా టోర్నీలో చిన్న జట్లు సంచలన ప్రదర్శనలతో ఫేవరెట్లకు షాకివ్వగా.. కొన్ని అగ్రశ్రేణి జట్లు ఊహించని విధంగా ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ప్రపంచ ఫుట్ బాల్ ను ఆశ్చర్యపరిచిన ఈ టోర్నీలో నమోదైన అత్యంత సంచలన క్షణాలు ఇవే..

బిగ్గెస్ట్ సెన్సేషన్ ‘కేప్ వెర్డే’

కేవలం 5 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న ద్వీప దేశం ఈ టోర్నీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్ గా నిలిచింది. గ్రూప్ స్టేజ్‌లో వరల్డ్ క్లాస్ టీమ్ స్పెయిన్ ను 0-0తో నిలిపి షాకిచ్చిన ఈ జట్టు.. నాకౌట్ రౌండ్ ఆఫ్ 32లో బలమైన అర్జెంటీనాను ముప్పతిప్పలు పెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. ఎక్స్ట్రా సమయంలోనూ కేప్ వెర్డే అద్భుతంగా పోరాడినా.. అర్జెంటీనా అనుభవం ముందు చివరకు తలవంచింది. అదనపు సమయం చివరి నిమిషాల్లో అర్జెంటీనా స్టార్ ఆటగాడు చేసిన ఏకైక గోల్ తో 1-0 తేడాతో కేప్ వెర్డే ఓటమిపాలైంది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చిన ఈ చిన్న జట్టు పోరాట స్ఫూర్తి కొట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.

అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 12 సంచలన సేవ్స్ తో లైనెల్ మెస్సి పటాలాన్ని వణక్కించిన కేప్ వెర్డే 40 ఏళ్ల వెటరన్ గోల్‌కీపర్ వోజిన్హా రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్ అయ్యాడు. మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో పెరిగింది.

జర్మనీకి పరాభవం.. పరాగ్వే సంచలనం

టోర్నీలో క్యూరాకోపై 7-1తో భారీ విజయం సాధించి భీకర ఫామ్ లో కనిపించిన జర్మనీకి.. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వే ఊహించని షాకిచ్చింది. ఉత్కంఠ మధ్య జరిగిన పెనాల్టీ షూటౌట్ లో జర్మనీని మట్టికరిపించి పరాగ్వే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన జర్మనీ.. రౌండ్ ఆఫ్ 32 లోనే కన్నీళ్లతో టోర్నీ నుంచి నిరాశగా ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత జరిగిన ‘రౌండ్ ఆఫ్ 16’లో ఫ్రాన్స్ చేతిలో 1-0 తేడాతో పరాగ్వే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈజిప్ట్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

టోర్నమెంట్లో సరికొత్త శకానికి నాంది పలుకుతూ ఈజిప్ట్ జట్టు తమ వరల్డ్ కప్ చరిత్రలోనే మొట్టమొదటి నాకౌట్ విజయాన్ని నమోదు చేసింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో పటిష్టమైన ఆస్ట్రేలియాను పెనాల్టీ షూటౌట్ లో ఓడించి సంచలనం సృష్టించింది. అయితే, క్వార్టర్ ఫైనల్ బెర్తు కోసం జరిగిన పోరులో స్పెయిన్ చేతిలో 2-1 తేడాతో ఈజిప్ట్ ఓడిపోయింది.

బ్రెజిల్, పోర్చుగల్ ముందే ఇంటి బాట

కప్‌ గెలుస్తాయని భావించిన ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్ జట్టు 1990 తర్వాత అత్యంత ఘోరమైన ప్రదర్శనతో రౌండ్ ఆఫ్ 16లోనే నార్వే చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. మరోవైపు క్రిస్టియానో రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్ కప్ కాగా, పోర్చుగల్ జట్టు కూడా రౌండ్ ఆఫ్ 16లోనే స్పెయిన్ చేతిలో ఓడిపోయి అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది.

కెనడా, డీఆర్ కాంగో తొలి విజయాల రికార్డు

గతంలో ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ ఓడిన కెనడా జట్టు ఈసారి ఖతార్, సౌతాఫ్రికాను ఓడించి రౌండ్ ఆఫ్ 32 చేరడమే కాకుండా రికార్డు స్థాయిలో 9 గోల్స్ కొట్టింది. అలాగే డీఆర్ కాంగో కూడా ఉజ్బెకిస్థాన్ ను ఓడించి హిస్టరీలో తమ మొదటి వరల్డ్ కప్ విజయాన్ని చూసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>