జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌లో చీలిక: అద్దంకి దయాకర్

కలం, వెబ్ డెస్క్: జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ (BRS) పార్టీ చీలికకు కారణం అవుతున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి చేరికను ఆ పార్టీ నేత హరీశ్ రావు (Harish Rao) వ్యతిరేకిస్తున్నాడని అన్నారు. కేటీఆర్ బతిమాలుకుని జీవన్ రెడ్డి దగ్గరకు హరీష్ రావును జగిత్యాల తీసుకెళ్లాడని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీశ్ రావు వెళ్లలేదని.. బీజేపీ నేతలతో కలిసి హరీశ్ రావు రహస్యంగా ఢిల్లీ వెళ్లారనే అనుమానాలున్నాయని చెప్పారు. జీవన్ రెడ్డి చేరికపై హరీశ్ రావు అలక వెనుక కారణాలు ఏమిటి? అని ప్రశ్నించారు.

పార్టీలో చీలికకు హరీశ్ రావు (Harish Rao) ప్రయత్నం చేస్తున్నాడని.. అందుకే ఢిల్లీ వెళ్లాడనే అనుమానాలున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి (Jeevan Reddy) చేరిక బీఆర్ఎస్‌లో చీలిక కారణం అవుతోందన్నారు. జీవన్ రెడ్డి చేరిక వల్ల హరీశ్ రావునే పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి వల్ల ముసలం మొదలైందని.. జీవన్ రెడ్డిని ఐరన్ లెగ్‌గా బీఆర్ఎస్ కాార్యకర్తలు భావిస్తున్నారని విమర్శించారు. ఏడాది తర్వాత బయటకు వచ్చి కేసీఆర్ జగిత్యాల సభకు వెళ్తుంటే.. ఆ సభకు హరీశ్ రావు ఎందుకు వెళ్లడం లేదు అని ప్రశ్నించారు. హరీశ్ రావును టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన కవిత.. ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిందని అద్దంకి (Addanki Dayakar) దుయ్యబట్టారు.

Read Also: మానవత్వం చాటుకున్న సోనూసూద్.. చిన్నారికి పునర్జన్మ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>