epaper
Tuesday, November 18, 2025
epaper

జూబ్లీ ఎన్నిక.. రంగంలోకి బీజేపీ హైకమాండ్

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలపై బీజేపీ కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు పోటీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ ఉపఎన్నికపై కమలం పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించింది. ఈ ఉపఎన్నిక ప్రచారంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయడం కోసం ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సన్ రంగంలోకి దిగారు. ఇప్పటికే పలువురు నేతలతో భేటీ అవుతున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Ramachandra Rao) అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఇందులో ఇప్పటివరకు జరిగిన ప్రచార తీరు, ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చిస్తున్నారు.

Read Also: మొంథాతో జాగ్రత్త.. అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాల

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>