తెలంగాణలో మొంథా తుపాను(Cyclone Montha) ప్రభావం భారీ ఉంది. 16 జిల్లాలకు వాతావరణ శాఖ వరద ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా పలు జిల్లాలో భీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) కీలక సూచనలు చేశారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు హై అలర్ట్‌లో ఉండాలని చెప్పారు.
‘‘ఈఎన్సీలు, సీఎస్‌లు, ఎస్‌ఈలతో సమీక్షించి, క్షేత్ర స్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ప్రతి అధికారి ఫీల్డ్ లెవెల్‌లో క్లోజ్ మానిటరింగ్ చేయాలని అత్యవసరం అయితే తప్ప సెలవులకు వెళ్లవద్దని స్పష్టం చేశాం. లోకాజ్‌వేలు, కల్వర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు.. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించాం. ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని జిల్లాలతో అనుసంధానం. ప్రజా రవాణాకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని ఆదేశాలు. మాన్సూన్ సమయంలో మా ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో చేసిన మేల్కొలుపు చర్యలు అభినందనీయం. అదే స్పూర్తిని ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొనసాగించాలి. ప్రజలందరూ అత్యవసరం అయితేనే రోడ్లపైకి రావాలి. స్థానిక అధికారులు జారీ చేసే సూచనలు ఖచ్చితంగా పాటించాలి’’ అని Minister Komatireddy తెలిపారు.
Read Also: తెలంగాణలో 16 జిల్లాలకు ‘మొంథా’ ముప్పు

