పౌరులకు చేరువలో ఉండటం కోసం హైదరాబాద్ సీపీ సజ్జనార్(Sajjanar) అన్ని మార్గాలను అప్రోచ్ అవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు ఫ్లాట్‌ఫార్మ్స్‌లో అందుబాటులో ఉన్న సజ్జనార్.. తాజాగా వాట్సాప్‌లోకీ ఎంట్రీ ఇచ్చారు. బుధవారం అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను ప్రారంభించారు. ‘‘భారత్‌లో అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని, తాజా అప్ డేట్లను మిస్ కాకుండా తెలుసుకోవడానికి ఈ ఛానెల్‌ను వెంటనే ఫాలో కావాలి’’ అని ఆయన తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో తన వాట్సాప్ ఛానెల్ క్యూఆర్ కోడ్‌ను కూడా షేర్ చేశారు.
Read Also: రోహిత్ రికార్డ్.. అగ్రస్థానం సొంతం..

