టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma).. రికార్డ్ సాధించారు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు, మూడో వన్డేలో రోహిత్ అదరగొట్టాడు. మూడో వన్డేలో 73 బంతుల్లో 121 నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 36 రేటింగ్ పాయింట్స్ సంసాదించుకున్నాడు. ఆ పాయింట్లతో వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్ టాప్ స్పాట్‌ను సొంతం చేసుకున్నాడు. అత్యంత లేటుగా నెంబర్ స్థానాన్ని సాధించిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. మొన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న రోహిత్ ఒకేసారి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్‌కు చేరుకున్నాడు. సచిన్, ధోని, కోహ్లీ, గిల్ తర్వాత వన్డే బ్యాటర్లలో నెంబర్ వన్ స్పాట్ దక్కించుకున్న భారత ప్లేయర్‌గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు.
Read Also: కాంగ్రెస్ ఈవెంట్‌లో బంగ్లాదేశ్ జాతీయ గీతం..

