ప్రేమలో మోసపోయిన యువతి.. ‘నాన్న జాగ్రత్త’ అని చేతిపై రాసుకుని ఆత్మహత్య

కలం, వెబ్​ డెస్క్​ : ప్రేమలో మోసపోయిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ‘నాన్న జాగ్రత్త’ అంటూ తన చేతిపై రాసుకుని అంతిమ సందేశాన్నిచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం (Prakasam) జిల్లా మార్కాపూరంలోని పామూరు మండలం అయ్యవారిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జి.మాధవి డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ పాఠాశాలలో టీచర్​ గా పని చేస్తోంది. ఈ క్రమంలో నాగూర్ భాషా అనే వ్యక్తితో ప్రేమ ఏర్పడింది. అయితే, భాషాకు అప్పటికే పెళ్లి అయిందని తెలుసుకున్న మాధవి అతడిని దూరం పెట్టడం మొదలు పెట్టింది.

దీంతో నాగూర్​ భాషా యువతితో దిగిన వ్యక్తిగత ఫోటోలు సోషల్​ మీడియాలో పెడుతానంటూ బెదిరించాడు. ఈ బ్లాక్​ మెయిల్​ తట్టుకోలేక ఆదివారం రాత్రి మాధవి ఫ్యాన్​ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ కు ముందు తన చేతిపై ‘నాన్న జాగ్రత్త’ అంటూ రాసుకోవడం అందరినీ కలిచివేసింది. మాధవి ఆత్మహత్యకు కారణమైన నాగూర్ భాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్​ చేశారు. ఘటనపై సమచారం అందుకున్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన జిల్లా (Prakasam) లో విషాదాన్ని నింపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>