Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 8 వేల ఆస్పత్రులకు తాత్కాలిక అనుమతి

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 వేల కొత్త ప్రైవేట్ ఆస్పత్రులకు (Private Hospitals) తాత్కాలిక అనుమతులు ఇవ్వనున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆస్పత్రులు ఆన్‌లైన్‌లో అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తే వెంటనే తాత్కాలిక ధృవపత్రాలు జారీ చేయబడతాయని అధికారులు తెలిపారు. అనంతరం పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించిన తర్వాత శాశ్వత అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం ద్వారా ఆరోగ్య సేవల విస్తరణ వేగవంతం అవుతుందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో  వైద్య సదుపాయాలు మరింత మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోగ్య శాఖ ఈ నిర్ణయంపై అధికారిక మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>