Mobile Popup Ad
Mobile Popup Ad

బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుంది? నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలు!

కలం, వెబ్‌డెస్క్: బొట్టు (Bindi) అనేది భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన, ప్రాముఖ్యత కలిగిన ఆచారం. ముఖానికి అందాన్ని, కళను ఇచ్చే ఈ బొట్టు వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సామాజిక అర్థాలు ఉన్నాయని మీకు తెలుసా? సాధారణంగా హిందూ సంప్రదాయంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతిఒక్కరూ బొట్టు పెట్టుకుంటారు. అయితే బొట్టు పెట్టుకోకుండా అస్సలు బయటికి వెళ్లొద్దని చెబుతుంటారు మన పెద్దలు. వారు అలా చెప్పడం వెనుక సంప్రదాయం మాత్రమే కాదు సైన్స్ కూడా దాగుందని మీకు తెలుసా? అంతే కాకుండా బొట్టు పెట్టుకోవడం (Wearing Bindi) వలన ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బొట్టు పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

సాధారణంగా బొట్టును అలంకరణ కోసం పెట్టుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు తప్పనిసరిగా నుదుట బొట్టు పెట్టుకోవడం మన సాంప్రదాయంగా వస్తుంది. మనం రెండు కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటాం. దీని వెనుక 3000 ఏళ్ల సైన్స్, ఆధ్యాత్మికత దాగుందని చెబుతున్నారు నిపుణులు. మన రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుందంట. ఇక్కడ ఎరుపు రంగు తిలకం పెట్టుకోవం వలన ఇది అంతర్గత జ్ఞానాన్ని పెంచి శక్తులను అభివృద్ధి చేస్తుందని పండితులు చెబుతుంటారు. ఇక సైన్స్ పరంగా చూస్తే, ఇక్కడ పీనియల్ గ్రంధి ఉంటుంది. ఇది మెలటోనిన్, సెరోటోనిన్ హార్మోన్స్ విడుదల చేస్తుందంట. దీని వలన ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మంచి నిద్ర, ఏకాగ్రతను పెంచడానికి ఉపయోగపడుతుందట.

కానీ ప్రస్తుత కాలంలో యువత చాలవరకు బొట్టు పెట్టుకోవడం మానేశారు. కానీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా బొట్టు పెట్టుకోవడం వలన తలనొప్పిని తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అయితే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు రెండు కనుబొమ్మల మధ్య చేతితో మసాజ్ చేసినట్లు చేస్తుంటాము. ఇలా చేయడం వలన ఆ స్థానంలో ఉండే బిందువు, తలనొప్పిని తగ్గించి, ప్రశాంతతను అందిస్తుందట. అంతే కాకుండా మనిషిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.

మనం నుదుటిన పెట్టుకునే బొట్టు సూర్యుడి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందట. అంతే కాకుండా నుదట బొట్టు పెట్టుకోవడం వలన మెదడులోని Frontal Lobe యాక్టివ్ అవుతుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. అంతే కాకుండా ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడం వలన పెళ్లైన స్త్రీల భర్త ఆయువు పెరుగుతుందని, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతుంటారు పండితులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>