కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) రేపు దిల్లీకి వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక హస్తినకు వెళ్తుండటం ఇదే తొలిసారి. ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయి, రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలను వివరించబోతున్నారు. మరీ ముఖ్యంగా, కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకధాతు డ్యాం నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని కోరబోతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా ఈ డ్యాం నిర్మాణానికి పూనుకోవడాన్ని సీఎం విజయ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలే కావేరి జలాలపై ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. కావేరి ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని ప్రధాని వద్ద మరోసారి ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.

