Mobile Popup Ad
Mobile Popup Ad

ఫ్యాక్షనిజం రాయలసీమలో ముగిసిన అధ్యాయం: మాజీ మంత్రి

కలం, వెబ్ డెస్క్ :  సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasada Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని.. ప్రభుత్వ వైఫల్యాల దృష్టి మరల్చడానికి తమ అధినేత జగన్ క్రిమినల్, ఫ్యాక్షనిస్టు అంటూ అసత్య ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఫ్యాక్షనిజం రాయలసీమలో ముగిసిన అధ్యాయమని.. సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యలతో ఫ్యాక్ష‌న్‌కి మ‌ళ్లీ జీవం పోస్తున్నారని ఆరోపించారు.

వైయస్సార్ కృషితో రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్షనిజం అంతమైందని చెప్పారు. ఇప్పటి నుంచే జగన్ ను ఓడించాలని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జ‌గ‌న్ పై వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసి, గొడ్డ‌లి పార్టీ అంటూ వైసీపీని బూచిగా చూపించే కుట్ర‌లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఐదేళ్ల తర్వాత చంద్రబాబు తన పనితీరుపై ఓటు అడగాలి తప్ప… ఇలా భయపెట్టి కాదు అని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>