కలం, వెబ్ డెస్క్ : ప్రపంచంలో ప్రేమకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రేమను దక్కించుకోవడానికి కొందరు ఎంత దూరమైనా వెళ్తే.. మరికొందరు తమ కుటుంబ పెద్దలను ఎదిరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని మహబూబాబాద్ చెందిన ఇద్దరు ప్రేమికులు వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో 2003లో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, వారి తల్లిదండ్రులు దు:ఖాన్ని భరించలేక.. తమ పిల్లల ప్రేమకు గౌరవం ఇవ్వాలని భావించారు. ఇద్దరి విగ్రహాలను తయారు చేయించి ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున ఆ విగ్రహాలకు వివాహం (Statues Marriage) జరిపిస్తున్నారు. కాలక్రమేనా ఇది ఆ గ్రామం సాంప్రదాయంగా మారిపోయింది. నవమి రోజు గ్రామస్తులు అంతా కలుస్తారు. ప్రేమికుల విగ్రహాలకు సాంప్రదాయ దుస్తులు, పూల మాలలు వేసి పెళ్లి వేడుకలు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు, కుటుంబం ఒత్తిళ్లు, ప్రేమను వ్యతిరేకించడం వల్ల చనిపోయిన ప్రేమికుల ఆత్మకు శాంతి కలగాలని ఇలా చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
Read Also: CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. IPL మ్యాచ్ లకు ధోని దూరం!
Follow Us On: Instagram

