CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. IPL మ్యాచ్ లకు ధోని దూరం!

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ (IPL 2026) ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కూల్.. ఈ టోర్నీకి దూరం కానున్నారని ఫ్రాంచైజీ చేసిన ప్రకటనే దీనికి కారణం. ధోని (MS Dhoni) గాయం కారణంగా మొదటి రెండు వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. కాఫ్ స్ట్రెయిన్ (పిక్క కండరాల గాయం) కారణంగా ధోని మొదటి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని ఫ్రాంచైజీ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ సీజన్‌లో కనీసం మొదటి నాలుగు మ్యాచ్‌లకు ఆయన దూరం కావచ్చని సమాచారం.

మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో తొలి పోరు, ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్, ఏప్రిల్ 5న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లకు ధోని దూరమయ్యే అవకాశం ఉంది. జట్టుకు ధోని (MS Dhoni) దూరం కావడంతో ఈ మ్యాచ్‌లలో వికెట్‌ల వెనక ఉండే ప్లేయర్ ఎవరు? అనేద ప్రస్తుతం కీలకంగా మారింది. ధోని లేని సమయంలో వికెట్ కీపింగ్ బాధ్యతలను సంజూ శాంసన్ లేదా ఉర్విల్ పటేల్‌లలో ఒకరు చేపట్టే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను ట్రేడ్ చేసి మరీ శాంసన్‌ను సీఎస్‌కే జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్‌లో శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో పాటు వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

Read Also: పోషకాహారం తింటున్నా లోపం తగ్గట్లేదా? అసలు కారణం ఇదే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>