Mobile Popup Ad
Mobile Popup Ad

ఇండియా బుక్ అఫ్ రికార్డ్ లో చోటు.. చిన్నారికి గంగుల అభినందన

కలం, కరీంనగర్ బ్యూరో: ఇండియా బుక్ అఫ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్న చిన్నారిని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కరీంనగర్ (Gangula Kamalakar) ఆదివారం అభినందించారు. నగరంలోని మంకమ్మతోటకు చెందిన అయిదేళ్ల చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు-2026లో పేరు నమోదు చేసుకుంది. కరీంనగర్ చెందిన బి.రాజేంద్రప్ర సాద్, ప్రత్యూషల కుమార్తె బొబ్బిలి నిధిశ్రీ పటేల్ (Nidhishree Patel) స్థానిక ఓ ప్రైవేటు పాఠ శాలలో ఒకటో తరగతి చదువుతుంది.

నిధిశ్రీ నాలుగేళ్ల వయసులోనే తైక్వాండో సాధన ప్రారంభించింది. శిక్షణ మొదలైన కొన్ని నెలల్లోనే తెలం గాణ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్లో పతకం సాధించి సత్తా చాటింది. ఒక రజత నిమిషంలో 112 తైక్వాండో కిక్స్ ప్రదర్శించిన వీడియోను మే 27న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సుకు పంపించగా జూన్ 3న రికార్డ్సులో స్థానం కల్పించినట్లు నిర్ధారించారు.

ఇంత చిన్న వయస్సులో అద్భుతాలు సృష్టిస్తున్న చిన్నారి భవిష్యత్తులో.. దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నానీ ఎమ్మెల్యే గంగుల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మెన్ లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్ నలువాల పుష్ప లత – రవీందర్ లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>