డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 10 మందికి జైలు శిక్ష

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 426 మంది పట్టుబడినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. వీరిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపర్చగా, పది మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. మిగతా వారికి రూ.41.60 లక్షల జరిమానా విధించినట్లు వివరించారు. కమిషనరేట్ పరిధిలో తనిఖీల్లో అత్యధికంగా మద్యం తాగి బండి నడిపినవారే ఎక్కువ పట్టుబడినట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలనే అనేక ప్రమాదాలు జరుగుతాయని, ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>