గోదావరి నది జలాలతో మూసీని నింపుతాం : సీఎం రేవంత్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : గోదావరి నది జలాలతో మూసీ నదిని (Musi River) నింపుతాం అని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్​ మంచిరేవుల లో రూ.700 కోట్లతో 8 ఎకరాల్లో నిర్మించే ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మత సామరస్యానికి మూసీ నది ప్రాంతం వేదిక కానుందని తెలిపారు. మూసి నదిని కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో ఢిల్లీలోని యమునా నదిలా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.. మూసీ ప్రక్షాళన (Musi Rejuvenation) అత్యవసరమని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లోని కాలుష్యం అంతా మూసీలోనే కలుస్తోందని.. ఈ కాలుష్యం నల్లగొండ వరకు వెళ్తొందని చెప్పారు. కాలుష్యం కారణంగా పుట్టిన ఊరి నుంచి పిల్లలను బయటకు పంపే దుస్థితి నల్లగొండ జిల్లాలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నది నుంచి 20 టీఎంసీలు మూసీలోకి తరలిస్తున్నామన్నారు. మూసీ దుస్థితికి ప్రకృతి తప్పిదం కాదని.. మానవుడి నిర్లక్ష్యమే కారణమని సీఎ రేవంత్​ రెడ్డి అన్నారు.  గోదావరి, కృష్ణా నది జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నామని సీఎం (CM Revanth Reddy) వెల్లడించారు.
మూసీ నది పునరుజ్జీవంపై చాలా మంది ప్రయత్నించగా.. ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదన్నారు. ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు.

నది పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందిందని.. సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. రాజకీయ కారణాలతో మూసీ పునరుజ్జీవనంను అడ్డుకోవడం ఏ సంస్కృతి? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక.. మూసీ పరివాహకంలో మతసామరస్యానికి చిహ్నంగా ఒక మసీదు, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించబోతున్నామని ప్రకటించారు. మూసీ పరివాహక ప్రజాప్రతినిధులు మూసీ ప్రక్షాళన చెయ్యాల్సిందే అని రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తుంటే.. తాము చేయలేనిది ఎవరూ చేయొద్దనే అక్కసుతో కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నూరైనా.. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు ఆగదన్నారు. మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతానన్నారు. ఇది ఓట్ల కోసం.. నోట్ల కోసం చేస్తున్న పని కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.

Read Also: CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. IPL మ్యాచ్ లకు ధోని దూరం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>