కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు (KBR Park) లో చెట్ల నరికివేతకు సంబంధించిన కేసుపై నేడు సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. కేబీఆర్ పార్క్ చుట్టూ అభివృద్ధి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెట్ల నరికివేతకు పాల్పడుతున్నారని పేర్కొంటూ పలువురు పర్యావరణ ప్రేమికులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ప్రభుత్వం పార్కులో చెట్లను నరకడం లేదని స్పష్టం చేశారు. కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది.

