epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కోల్‌కతా ఘటనకు మెస్సీనే కారణం: గవాస్కర్

కలం డెస్క్: ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్‌కతా( Kolkata) గ్రౌండ్‌లో జరిగిన గందరగోళంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ గందరగోళానికి, నష్టానికి, అభిమానుల ఆగ్రహానికి అంతటికి మెస్సీ, అతని టీమే కారణం అన్నారు. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని వ్యాఖ్యానించారు. గవాస్కర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన కోల్‌కతా అంశనికి మెస్సీ(Lionel Messi)ని బాధ్యుడిని చేయడాన్ని పలువురు తప్పుబడుతుంటే, మరికొందరు గవాస్కర్‌ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా(GOAT India Tour)’లో భాగంగా లియోనెల్‌ మెస్సీ కోల్‌కతా సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో పాల్గొన్న ఈవెంట్‌లో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మెస్సీ రెండు గంటల పాటు మైదానంలో ఉండాల్సి ఉండగా, భద్రతా కారణాలు చూపుతూ కేవలం 22 నిమిషాలకే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానంలోకి వాటర్‌ బాటిళ్లు విసిరి, కుర్చీలు ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar), కోల్‌కతా గందరగోళానికి అసలు బాధ్యుడు మెస్సీనేనని ఆరోపించాడు. షెడ్యూల్‌కు కట్టుబడి ఉండకపోవడమే సమస్యకు మూలకారణమని పేర్కొన్నాడు. మెస్సీకి ఎలాంటి భద్రతా ముప్పూ లేదని, కొద్దిసేపు మైదానంలో తిరుగుతూ అభిమానులను పలకరించాల్సిందని వ్యాఖ్యానించాడు. అతడి చుట్టూ వీఐపీలు మూగి ఉండటం వల్లే ప్రేక్షకులు నిరాశ చెందారని గావస్కర్‌ అన్నాడు. హైదరాబాద్‌, ముంబయి, దిల్లీల్లో మెస్సీ పర్యటన సజావుగా జరిగిన విషయాన్ని గుర్తు చేసిన గావస్కర్‌, కోల్‌కతా ఘటనకు నిర్వాహకులు లేదా అభిమానులను నిందించే ముందు సంబంధిత వ్యక్తులు తమ వాగ్దానాలను నిలబెట్టుకున్నారా లేదా అన్నదాన్ని పరిశీలించాలన్నాడు.

Read Also: ఆర్‌సీబీ చెంతకు వెంకటేష్ అయ్యర్‌.. రేట్ భారీగా తగ్గిందిగా?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>