కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో(Panchayat Elections) చాలా అరుదైన ఘటనలు జరిగాయి. ఈ సారి ఎక్కువగా ఇన్ ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఉన్న వారు గెలిచారు. రెండో విడత ఎన్నికల్లో ఓ ఫోక్ డ్యాన్సర్ సర్పంచ్ గా ఎన్నికైంది. ఫోక్ డ్యాన్సర్ అయిన శివానీసుమన్ (Shivani Suman) కు ఇన్ స్టాగ్రామ్ లో లక్షా 60వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సిన్నదొర బంగుల మీద, లాగెలాట సూడు వదినె లాంటి ఎన్నో ఫోక్ సాంగ్స్ లో ఆమె శివానీసుమన్(Shivani Suman) డ్యాన్సర్ గా మెరిసింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న శివానీ రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లా ఇల్లంతకుంట మండలం బోటిమీది పల్లె గ్రామ సర్పంచ్ గా పోటీ చేసింది. భర్త సపోర్ట్ తో ఆమె ఎన్నికల్లో గెలిచింది. దీంతో ఆమెకు ఫాలోవర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Read Also: మార్చిలోపు మెట్రో అప్పగించాలి: తెలంగాణ సీఎస్
Follow Us On: X(Twitter)


