కలం డెస్క్: ఐపీఎల్ 2026 వేలంలో వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer)కు భారీ షాక్ తగిలింది. తన ఖరీదు భారీగా పడిపోయింది. గతేడాది రూ.23కోట్లుగా ఉన్న అతడు ఈ ఏడాది రూ.7కోట్లకే అమ్ముడు బోయాడు. అతడిని డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆర్‌సీబీ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో జరుగుతున్న వేలంలో ఆయనను సొంతం చేసుకోవడం విశేషంగా నిలిచింది.
గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన వెంకటేష్ అయ్యర్‌కు ఇది కొత్త ఆరంభంగా మారనుంది. 2026 వేలంలో KKR కూడా ఆయనను తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, రాజత్ పాటిదార్ నాయకత్వంలోని RCB బిడ్డింగ్‌లో గెలిచి కీలక ఆల్‌రౌండర్‌ను తమ శిబిరంలోకి చేర్చుకుంది. ముఖ్యంగా, ఈ వేలంలో RCB చేసిన తొలి సంతకం ఆయనే కావడం జట్టుకు మరింత బలాన్నిచ్చే అంశంగా మారింది.
బ్యాట్‌తో పాటు బంతితో కూడా జట్టుకు ఉపయోగపడే సామర్థ్యం ఉన్న వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer), RCB మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూర్చే అవకాశముంది. తక్కువ ధరకు అనుభవజ్ఞుడైన భారత ఆల్‌రౌండర్‌ను దక్కించుకోవడం RCBకు పెద్ద ప్లస్‌గా భావిస్తున్నారు. ఈ సీజన్‌లో ఆయన RCB జెర్సీలో మెరిసి, జట్టును మరోసారి విజయపథంలో నడిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Also: ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram


