కలం, వెబ్ డెస్క్ :గీతం యూనివర్సిటీ (Gitam University)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 17 ఏళ్లుగా కరెంట్ బిల్లులు కట్టకపోవడం ఏంటని వ్యాఖ్యానించింది. గీతం యూనివర్సిటీ 2008 నుంచి ఇప్పటి వరకు కరెంట్ బిల్లులు కట్టలేదని.. పెండింగ్ బిల్లులు మొత్తం రూ.118 కోట్లు చెల్లించాల్సి ఉందని విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో యూనివర్సిటీ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక యూనివర్సిటీ అధికారులపై సీరియస్ అయ్యారు. సామాన్యులు రూ.వెయ్యి కట్టకపోయినా కరెంట్ కట్ చేస్తున్న విద్యుత్ శాక అధికారులు.. గీతం యూనివర్సిటీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది ధర్మాసనం.
గీతం యూనివర్సిటీ(Gitam University) ఏమైనా స్పెషలా.. లేదంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఊరుకున్నారా అని సీరియస్ అయింది. సూపరింటెండెంట్ ఇంజినీర్ వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు(High Court). దాదాపు మూడు ప్రభుత్వాలు మారినా గీతం యూనివర్సిటీ కరెంట్ బిల్లులు కట్టకపోవడం ఏంటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులపై అనుమానాలు వ్యక్తం చేసింది కోర్టు.
Read Also: మార్చిలోపు మెట్రో అప్పగించాలి: తెలంగాణ సీఎస్
Follow Us On: Youtube


