Nizamabad | ‘అమ్మా, నాన్న నన్ను వెతక్కండి. వేరే మార్గం లేకనే ఇలా చేశా’ అంటూ లేఖ రాసి పెట్టిన ఓ విద్యార్థి హాస్టల్ నుంచి పారిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చోటు చేసుకుంది. విజేత జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అర్జున్‌కు కాలేజీ నచ్చలేదు. కానీ, తల్లిదండ్రులు ఒత్తిడి మేరకు అక్కడ చదువుతున్నాడు. ఇక తన వల్ల కాదు అనుకున్న అర్జున్.. అక్కడి నుంచి పారిపోవాలని డిసైడ్ అయ్యాడు. అంతే తన అమ్మా, నాన్నకు ఒక లేఖ రాసిపెట్టి.. హాస్టల్ నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Nizamabad | ‘‘నేను ఆర్మీ హైరింగ్‌కి వెళ్తున్నా అమ్మ. ప్లీజ్ నాకోసం వెతక్కండి. నేను అక్కడ సంతోషంగా ఉంటా. బై..బై.. ఉంటాను. అక్కను బాగా చూసుకోండి. మీరు సంతోషంగా ఉండండి’’ అని అర్జున్ తన లెటర్‌లో రాశాడు.

