కాంగ్రెస్ పార్టీలోని కొందరు రెడ్డి నాయకులు తనపై కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)తో వివాదం నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అందుకు సీఎం కూడా ఒక రెడ్డి నాయకుడు అవడమే కారణం. అయితే కొండా సురేఖ.. పొంగులేటితో పాటు రేవంత్‌ను కూడా టార్గెట్ చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. పొంగులేటిపై తాను ఫిర్యాదు చేసినా రేవంత్ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే కొండా సురేఖ.. ఈ వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతోంది. ‘‘కొంతమంది రెడ్డి నాయకులు నాపై కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వంలో లాబీయింగ్ చేస్తున్నారు. నేను ఏ పని చేసినా వివాదం చేయాలని అనుకుంటున్నారు’’ అని కొండా సురేఖ అన్నారు.
Read Also: కాలేజీ నచ్చలేదని పారిపోయిన ఓ విద్యార్థి..

