గురుకులాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఏమాత్రం బాగోలేదని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. ఇప్పటి వారకు గురుకువాలలకు రావాల్సిన నిధులను ఎందుకు విడుదల చేయలేదు? అని ప్రశ్నించారు. గురుకులాల నుంచి కమీషన్లు రావనే నిధులను నిల్‌గా మార్చారా? అంటూ నిలదీశారు. హామీలతో మధ్యపెట్టడం, ఆ తర్వాత మాట మార్చడం రేవంత్(Revanth Reddy) సిద్ధాంతమని చురకలంటించారు. ఆయన మాటలకు చేతలకు పొంతనే ఉండదని, అందుకు గురుకులాలకు చాలీ చాలని నిధులు కేటాయించడం నిలువెత్తు నిదర్శనమని విమర్శలు గుప్పించారు.
‘‘రాష్ట్రంలోని 1024 గురుకులాలకు(Gurukul Schools) కేవలం 60 కోట్లు కేటాయించి, గోరంతను కొండంతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. రూ. 12 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి.. ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు చదివే గురుకులాలకు కనీసం రూ. 100 కోట్లు కేటాయించే మనసు రాలేదా? కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా? మీరు కేటాయించిన చాలీచాలని నిధులతో సిబ్బంది వేతనాలు, మోటార్ల మరమ్మతులు, అత్యవసర పనులు ఎలా సాధ్యం? చిత్తశుద్ధి లేని సమీక్షలతో గురుకులాలకు ఏం ప్రయోజనం?’’ అని హరీష్(Harish Rao) ప్రశ్నలు గుప్పించారు.
Read Also: దామోదర్ పేరిటా రాజకీయాలు.. ఫ్లెక్సీలు కట్టి మరీ..

