బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై వీధి కుక్క దాడి.. వీడియో వైరల్!

క‌లం, వెబ్ డెస్క్‌: దేశ వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు (Stray Dog Attacks) విపరీతంగా పెరిగిపోతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ఎవ్వరినీ వదలకుండా దాడికి పాల్పడుతున్నాయి. రోడ్డు మీద వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. నడుచుకుంటూ వెళ్లినా, బైక్ పై వెళ్లినా అదునుచూసి కుక్కలు దాడికి దిగుతున్నాయి. చిన్నపిల్లలు ఆడుకుంటుండగా.. కుక్కలు మందలుగా చేరి అటాక్ చేసిన ఘటనలు కోకొల్లలు. ఇటీవల కాలంలో కుక్కల దాడి ఘటనలు రోజుకొకటైనా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటున్నాయి.

తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లో ఓ యువకుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో బైక్ పై వెళుతుండగా వీధికుక్క దాడికి దిగింది. మూల మలుపు వద్ద బైక్‌ని నెమ్మదిగా నడుపుతుండగా.. అదును చూసి ఆ వ్యక్తి పిక్కను గట్టిగా పట్టేసింది. యువకుడి కాలును వీధి కుక్క గట్టిగా పట్టుకొని లాగడంతో అతడు బైక్ పై నుండి కిందపడిపోయాడు. కిందపడినా వదలకుండా ఆ కుక్క అతడిపై దాడి (Stray Dog Attacks) చేస్తూనే ఉంది. యువకుడు ఎంత ప్రయత్నించినా కుక్క పట్టు వీడలేదు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ భయానక దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read Also: మరో విషాదం.. అమెరికాలో విజయనగరం టెకీ మృతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>