Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికాలో స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు

కలం, వెబ్ డెస్క్ : భారతదేశ మహోన్నత వ్యక్తుల్లో ఒకరైన స్వామి వివేకానందుడికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. సియాటిల్ లోని వెస్ట్ లేక్ స్క్వేర్ లో వివేకానంద (Swami Vivekananda) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో యునైటెడ్ స్టేట్స్ లో ఇలాంటి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసిన మొదటి నగర ప్రభుత్వంగా సియాటిల్ చరిత్రలోకెక్కింది. నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన వివేకానందుడి కాంస్య విగ్రహాన్ని శనివారం రోజు సియాటిల్ నగర మేయర్ కేటీ విల్సన్, భారత కాన్సుల్ జనరల్ కలిసి ఆవిష్కరించారు.

లక్షలాది మంది సందర్శకులతో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో వెస్ట్ లేక్ స్క్వేర్ ఒకటి. అమెజాన్ ప్రధాన కార్యాలయం, సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ వంటి కీలకమైన ప్రదేశాలకు సమీపంలో స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయడం గమనార్హం. అమెరికా, భారతదేశం సాంస్కృతిక విస్తరణ ప్రయత్నాల్లో భాగంగా ఈ (Swami Vivekananda) విగ్రహాన్ని  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్లు, నాయకులు, భారతీయ – అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు, నగర కౌన్సిలర్లు, ప్రముఖులు హాజరయ్యారు.

Read Also: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై వీధి కుక్క దాడి.. వీడియో వైరల్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>