కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ చుక్కలు చూపించింది. అందులోనూ ఇంగ్లండ్ బౌలర్ జెమీ ఓవర్టన్ (Jamie Overton) దెబ్బకు కంగారూ జట్టు గిలగిల్లాడింది. దీంతో ఆసీస్ 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం చేజింగ్కు వచ్చిన ఇంగ్లండ్ తొలి బంతి నుంచే దూకుడు కనబరించింది. చివరకు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను లియామ్ డాసన్ దెబ్బతీశాడు. మిచెల్ మార్ష్, సామ్ హార్పర్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత ఓవర్టన్ ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆ జట్టు 16.5 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప టీ20 స్కోరు.
వర్షం కారణంగా సవరించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులభంగా ఛేదించింది. జోర్డాన్ కాక్స్ 14 బంతుల్లో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొమ్మిదో ఓవర్లోనే 93/3 స్కోరు చేసి విజయాన్ని అందించింది. ఈ ప్రదర్శనతో ఓవర్టన్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వికెట్లు తీసిన రెండో ఇంగ్లండ్ బౌలర్గా నిలిచాడు. అతడి ప్రదర్శన అద్భుతమని కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రశంసించాడు. సిరీస్లో తదుపరి మ్యాచ్ ఆదివారం సిడ్నీలో జరగనుంది. చివరి మ్యాచ్ బుధవారం కాన్బెర్రాలో జరుగుతుంది.

