రైతులకు QR కోడ్‌తో వాటర్‌ప్రూఫ్ పాస్ పుస్తకాలు: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఏడాదిన్నరలో ప్రతి అంగుళం భూమికి కాంగ్రెస్ సర్కార్ సమగ్ర సర్వే చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ భూ రీసర్వే నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర రైతులకు (Telangana Farmers) ఉచితంగా క్యూఆర్ కోడ్‌తో వాటర్‌ప్రూఫ్ పాస్ పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు. ఈ పాస్ పుస్తకాలు వాటర్‌ప్రూఫ్‌తో పాటు చిరిగిపోకుండా మన్నికైన విధంగా రూపొందిస్తామని అన్నారు.

స‌చివాల‌యంలో త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మంత్రి మాట్లాడుతూ.. మొద‌టి విడ‌త‌లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున న‌క్షాలేని 373 గ్రామాల్లో రీస‌ర్వే చేప‌ట్టామ‌ని తెలిపారు. ఈ స‌ర్వేను డిసెంబ‌ర్ చివ‌రినాటికి పూర్తి చేస్తామ‌ని స్పష్టం చేశారు. వ్యవసాయ భూములకు, ఆబాదీ ఆస్తులకు వేర్వేరుగా పాస్ పుస్తకాలు ఉంటాయని అన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను కలెక్టర్ల ఆధ్వర్యంలో ప‌రిష్కారం చూపుతామని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>