Mobile Popup Ad
Mobile Popup Ad

మరో విషాదం.. అమెరికాలో విజయనగరం టెకీ మృతి

కలం, వెబ్ డెస్క్: ఉన్నత ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న యువత అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, అనుకోని ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. ఈ క్రమంలో మరో విషాదకర ఘటన జరిగింది. విజయనగరం (Vizianagaram) జిల్లాకు చెందిన టెకీ (Techie) సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ మృతిచెందాడు. పుట్టినరోజు నాడే కన్నుమూయడం మరింత విషాదం రేపుతోంది. హరికృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామం. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. మూడు నెలల క్రితమే ఉద్యోగం సాధించాడు. నిన్న స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగగా.. ఈత రాకపోవడంతో జలపాతంలో మునిగి హరికృష్ణ మరణించాడు. ఈ ఘటనతో పిరిడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also:  అల్లూరి జిల్లాలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>