epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సిడ్నీలో స్మిత్​ రికార్డుల మోత

కలం, వెబ్​డెస్క్​: ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (Steve Smith) మరోసారి తన క్లాస్ ఆట చూపించాడు. సిడ్నీ టెస్ట్​లో రికార్డుల మోత మోగించాడు. యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదో టెస్ట్​ మొదటి ఇన్నింగ్స్​లో అజేయ సెంచరీ (129 నాటౌట్​; 205 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్​) చేశాడు. ప్యాట్ కమ్మిన్స్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్మిత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ జట్టును 518/7కు చేర్చి పటిష్ఠ స్థితిలో నిలిపాడు. ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ మొదటి ఇన్నింగ్స్​లో 384 పరుగులు చేయడంతో ఆసిస్​కు 134 పరుగుల ఆధిక్యం లభించింది.

స్మిత్​ రికార్డులివీ..
  • సిడ్నీ సెంచరీతో యాషెస్​లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆసిస్​ దిగ్గజం డాన్​ బ్రాడ్​మాన్​(19) తర్వాతి స్థానంలో స్మిత్​ (13) నిలిచాడు. మూడో స్థానంలో జాక్​ హాబ్స్​(12) ఉన్నాడు.
  • యాషెస్​లో అత్యధిక పరుగులు (3,682) చేసిన బ్యాటర్​గా స్మిత్ (Steve Smith) రెండో స్థానంలో నిలిచాడు. అతని​ కంటే ముందు డాన్ బ్రాడ్​మాన్​(5,028) టాప్​ ప్లేస్​లో ఉన్నాడు.
  • టెస్ట్​ల్లో అత్యధిక సెంచరీలు చేసినవాళ్ల జాబితాలో భారత ఆటగాడు రాహుల్​ ద్రావిడ్​(36)ను స్మిత్​(37) అధిగమించాడు. ఈ విషయంలో భారత దిగ్గజం సచిన్​ టెండూల్కర్​(51) టాప్​లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా లెజెండ్​ జాక్వెస్​ కలిస్​(45), ఆసిస్​ మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్​(41), ఇంగ్లాడ్​ ఆటగాడు జో రూట్​(41), శ్రీలంక వికెట్​ కీపర్​ బ్యాట్స్​మన్​ కుమార సంగక్కర (38) ఉన్నారు.
  • కెప్టెన్​గా స్మిత్​కు ఇది 18వ సెంచరీ. వీటిలో ఆరు ఇంగ్లాండ్​పైనే చేశాడు. తద్వారా టెస్ట్​ల్లో ఒకే ప్రత్యర్థిపై కెప్టెన్​గా అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
  • ఇంగ్లాండ్‌పై అన్ని ఫార్మాట్లలో స్మిత్ మొత్తం పరుగులు 5085కు చేరాయి. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్, కోహ్లీ తర్వాతి స్థానంలో స్మిత్​ నిలిచాడు.
  • SCGలో స్మిత్ ఇప్పటివరకు 1225 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉన్నాయి. సగటు 72కి పైనే. ఈ గణాంకాల కంటే మెరుగైన ప్రదర్శన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ది.
యాషెస్​ చరిత్రలో అత్యధిక పరుగులు

డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా) – 37 మ్యాచ్‌ల్లో 5028 పరుగులు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 41* మ్యాచ్‌ల్లో 3682* పరుగులు
జాక్ హాబ్స్ (ఇంగ్లాండ్) – 41 మ్యాచ్‌ల్లో 3636 పరుగులు
అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) – 42 మ్యాచ్‌ల్లో 3222 పరుగులు
స్టీవ్ వా (ఆస్ట్రేలియా) – 45 మ్యాచ్‌ల్లో 3173 పరుగులు

Read Also: ఆర్‌సీబీ మాజీ పేసర్‌కు డోపింగ్ పాజిటివ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>