కలం, మెదక్ బ్యూరో : శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయం లో జాతీయ స్థాయి యువ పార్లమెంట్ పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘తెలంగాణలో ఏమి చేశారని.. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చరని కవిత అడిగింది. కవిత ప్రశ్నలకు సమాధానం యువరాజు చెప్తాడా… బావ చెప్తాడా, బామర్దులు చెప్తారా…లేక కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి లేచి వచ్చి చెప్తారా?’ అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
పంజాబ్ , మహారాష్ట్ర , కర్ణాటక లో చనిపోయిన రైతులకు తెలంగాణ సొమ్ము ఇచ్చారని, మరి ఇక్కడి మన రైతులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించామన్నారు. ‘మీ పార్టీ బీ ఫామ్ పై గెలిచిన ఎంపీ. మీరు నామినేట్ చేసిన ఎమ్మెల్సీ, స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది. దీనిపై కేసీఆర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి’ అని రఘునందన్ రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు.
Read Also: ఈసారి విచారణకు నేనే వెళ్తా : మంత్రి ఉత్తమ్
Follow Us On: Instagram


