epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భూమివైపు దూసుకొస్తున్న స్టార్​లింక్​ శాటిలైట్

కలం, వెబ్​డెస్క్: స్టార్​లింక్​ శాటిలైట్ల (Starlink Satellite) లో ఒకటి అదుపుతప్పి భూమివైపు దూసుకొస్తోంది. భూమికి సుమారు 418 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న 35956 అనే శాటిలైట్​లో ఈ నెల 17న సాంకేతిక లోపం ఏర్పడింది. ప్రొపల్షన్ ట్యాంకులో తలెత్తిన సమస్య కారణంగా గ్యాస్​ బలంగా నెట్టడంతో కక్షలో​ దాదాపు నాలుగు కిలోమీటర్లకు కిందకు జారింది. దీంతో దానిపై గ్రౌండ్​ కంట్రోల్​ సిబ్బందికి సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో అదుపుతప్పిన శాటిలైట్​ నుంచి కొన్ని పరికరాలు వేరుపడినట్లు ఎలాన్​ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్​ సంస్థ తెలిపింది. ఈ శాటిలైట్​ శకలాలు వారం లోపల భూ వాతావరణంలోకి ప్రవేశించి, కూలిపోతాయని చెప్పింది. ప్రస్తుత శకలాలు, శాటిలైట్​ వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని, అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే కింద తిరుగుతోందని స్పేస్​ఎక్స్​ చెప్పింది. ఇవి భూ వాతావరణంలోకి రాగానే కూలిపోతాయని వివరించింది. శకలాలు అమెరికాలోని అలాస్కా సమీపంలో భూమిపై ఉండగా, వరల్డ్​వ్యూ–3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్​ ఫొటోలు తీసింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం అత్యధిక సామర్థ్యంతో ఇంటర్నెట్​ అందించేందకు దాదాపు 9వేలకు పైగా శాటిలైట్లను స్పేస్​ఎక్స్​ అంతరిక్షంలోకి పంపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>