కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గణనీయమైన స్థానాలు గెలుచుకున్నదని చెప్పుకొచ్చారు. గుర్తులమీద జరిగిన ఎన్నికలు అయి ఉంటే ఇంకా ఎక్కువ స్థానాలను గెలుచుకునేవాళ్లమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 శాతం స్థానాలను గెలుచుకున్నదని చెప్పారు.
కింది స్థాయి నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతో కేసీఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదని.. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
Read Also: అప్పుల ఊబిలో ఆశలు ఆవిరి.. దంపతుల ఆత్మహత్య
Follow Us On: Youtube


