గ్లోబ్‌ట్రోటర్(Globetrotter) ఈవెంట్‌ను సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగనుండటంతో అభిమానులు దీని కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగానే రాజమౌళి.. ఈవెంట్‌కు వచ్చేవారికి పలు జాగ్రత్తలు చెప్పారు. నవంబర్ 15న జరిగే ఈవెంట్ కోసం అభిమానులకంటే ఎక్కువగా తానే ఎదురుచూస్తున్నానని చెప్పారు. ‘‘ఎవరికీ ఇబ్బంది కలగకుండా, సురక్షితమైన, సంతోషకరమైన అనుభవాన్ని అందించడానికి పోలీసులు, భద్రతా సిబ్బందితో సహకరించండి.
ఈవెంట్‌కు 18 సంవత్సరాల లోపు వారికి, సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదు. గ్లోబ్ ట్రోటర్(Globetrotter) ఈవెంట్ అనేది ఓపెన్ ఈవెంట్ కాదు.. కేవలం ఫిజికల్ పాసులు ఉంటేనే రండి. ఈవెంట్ రోజు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ మూసివేస్తారు విజయవాడ, ఎల్బీనగర్, గచ్చిబౌలి రూట్ల నుండి వచ్చే వాళ్ల కోసం పాస్ మీద ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుంది. ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుండి తెరుస్తారు’’ అని చెప్పారు.
Read Also: ‘నన్ను దేశంలో సగం మంది చంపేయాలనుకున్నారు..’
Follow Us on: Youtube

