ఇండియాలో ఉన్న సగం మంది తనను చంపాలనుకున్నారంటూ హీరోయిన్ అదా శర్మ్(Adah Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన రెండు సినిమాలు.. దేశంలో సగం మంది నుంచి బెదిరింపులు రావడానికి కారణమైతే.. అవే రెండు సినిమాలు మిగిలిన సగం మంది నుంచి ప్రశంసలు తెచ్చిపెట్టాయని చెప్పారు. అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2023లో విడుదలైన ఈ సినిమా రాజకీయ, సినీ రంగాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. ఆ సినిమా గురించి తాజాగా మాట్లాడిన అదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘రిస్క్ పాత్రలు చేస్తేనే కెరీర్‌కు బూస్ట్ వస్తుంది. ఇండస్ట్రీలోకి ‘1920’ మూవీతో అడుగుపెట్టా. ఆ సినిమా ఓ పెద్ద సాహసం అనే చెప్పాలి. ‘ది కేరళ స్టోరీ’కి ముందు వరకు ఓ మంచి స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేదాన్ని. అలాంటిది ‘ది కేరళ స్టోరీ(The Kerala Story)’ కథ వచ్చింది. ఆ సినిమా విడుదలైన నా తర్వాత నా కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఆ తర్వాత ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చేశాను. ఆ రెండు సినిమాలు విడుదలైనప్పుడు నాకు బెదిరింపులు వచ్చాయి. దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు. మిగిలిన సగం మంది నాపై ప్రశంసలు గుప్పించారు. నన్ను రక్షించారు’’అని అదా(Adah Sharma) చెప్పింది.
Read Also: పాక్ నుంచి యూటర్న్ తీసుకున్న లంక ప్లేయర్లు..
Follow Us on: Instagram

