ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) పేర్కొన్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన సుస్థిరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతపై కీలక ప్రసంగం చేశారు. సదస్సులో నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులుఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. “క్లౌడ్ బరస్ట్, నగరాలు నీట మునుగడం, ఒకేచోట భారీ వర్షపాతం వంటి కష్టాలు గ్లోబల్ వార్మింగ్ వల్లే సంభవిస్తున్నాయని చెప్పారు. ఈ సమస్యలకు పరిష్కారం గ్రీన్ ఎనర్జీలో ఉందన్నారు. అందుకే మనం సుస్థిరమైన, పర్యావరణ అనుకూల పరిష్కారాలను సాధించాలని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సౌర, పవన, పంప్డ్ హైడ్రోజన్ ఎనర్జీ రంగాల్లో చురుగ్గా పనులు చేస్తున్నదని చెప్పారు. రానున్న డేటా సెంటర్లకు కూడా 100% గ్రీన్ ఎనర్జీ(Green Energy) సరఫరా చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే, భారత్, ఈయూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మరింత సమర్థంగా సహకరించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షించే దిశగా కూడా చంద్రబాబు(Chandrababu) ముఖ్య వ్యాఖ్యలు చేశారు. “ప్రస్తుతం నౌకా నిర్మాణ రంగంలో భారత్ వెనుకబడి ఉంది. ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను అందించడానికి విదేశీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాము” అన్నారు.
గ్రీన్ ఎనర్జీతోపాటు ఆర్గానిక్ ఆహార రంగంలో కూడా ఏపీ కీలకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రకృతి సేద్యంలో పండించిన ‘అరకు కాఫీ’ ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. చివరగా, మానవ సంక్షేమం కోసం అంతర్జాతీయ సమూహాలుగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
Read Also: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థి మృతితో నిరసన
Follow Us on: Youtube

