Menstrual Leave Policy | కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 18 నుంచి 52 సంవత్సరాల వయస్సు గల మహిళా ఉద్యోగులకు ప్రతి నెల ఒక రోజు వేతనంతో కూడిన సెలవు అదనంగా ఇవ్వనున్నారు. నెలసరి సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సెలవు శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. మహిళా ఉద్యోగులు ఈ సెలవు కోసం వైద్య ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు. నెలలో ఒకరోజు మాత్రం సెలవు తీసుకోవచ్చు. ఆ సెలవు ఈ నెలకు మాత్రమే పరిమితం.
ఈ కొత్త విధానం ఫ్యాక్టరీల చట్టం, కర్ణాటక దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, తోటల కార్మికుల చట్టం, బీడీ, సిగార్ కార్మికులు (ఉపాధి పరిస్థితులు) చట్టం, మోటారు రవాణా కార్మికుల చట్టం వంటి చట్టాల కింద నమోదైన అన్ని పరిశ్రమలు, సంస్థలలో పనిచేసే మహిళలకు వర్తిస్తుంది. మహిళల ఆరోగ్యం సమస్యలు, సామర్థ్యం, పనితీరు, మానసిక శ్రేయస్సును దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానాన్ని(Menstrual Leave Policy) అమలు చేసిన దేశంలోని తొలిరాష్ట్రంగా కర్ణాటక(Karnataka) నిలిచింది.
Read Also: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ: చంద్రబాబు
Follow Us on : Pinterest

