బ్యాటింగ్ లో SRH భళా.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ఆరంభమే అదిరిపోయింది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) భారీ స్కోరు సాధించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), హెన్రిచ్ క్లాసెన్ (31), అనికేత్ వర్మ (43) రాణించారు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ముందు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

మొదట టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ను ఆరంభించిన SRH జట్టు 29/3తో తీవ్ర కష్టాల్లో పడింది. విధ్వంసకర బ్యాటర్లుగా పేరున్న ఓపెనర్లు తొందరగానే పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ (8 బంతుల్లో 1 సిక్సుతో 7 పరుగులు), ట్రావిస్ హెడ్ (9 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు) తొలి మ్యాచ్ లో తడబడ్డారు. వన్ డౌన్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి (6 బంతుల్లో 1 పరుగు) కూడా నిరాశపరిచాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ (80),  క్లాసెన్ (31) అద్భుతమైన బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. చివర్లో అనికేత్ వర్మ ( 18 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సులతో 43 పరుగులు) హాఫ్ సెంచరీని జస్ట్ లో మిస్ చేసుకున్నాడు. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో జాకబ్ డఫీ కీలకమైన 3 వికెట్లు తీసుకోగా, రోమారియో షెపర్డ్ 3 వికెట్లను పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>