కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుతం AI టెక్నాలజీతో హీరోలు, హీరోయిన్లపై అభ్యంతరకరంగా ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా శ్రీలీల (Sreeleela) AI ఫొటోలను కూడా ఇలాగే ఎడిట్ చేసి పోస్టు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాజాగా శ్రీలీల స్పందించింది. ఏఐ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం మంచిది కాదని ఫైర్ అయింది. ‘చేతులు జోడించి అడుగుతున్న AI టెక్నాలజీని ఇలా దుర్వినియోగానికి వినియోగించొద్దు. టెక్నాలజీ మన లైఫ్ స్టైల్ ను సులభం చేయాలి. అంతే గానీ దాన్ని చెడు పనులకు వినియోగించొద్దు. సోషల్ మీడియాలో నాపై వచ్చే ఫొటోలు, వీడియోలను కొన్ని సార్లు వర్క్ బిజీ వల్ల చూడలేకపోతున్నా. కానీ నా ఫ్రెండ్స్ నాకు ఈ విషయాన్ని చెప్పడంతో నోటీస్ చేశాను’ అంటూ తెలిపింది శ్రీలీల.
ప్రతి ఇంట్లో అమ్మాయిలు ఉంటారని.. కూతురు, మనవరాలు, చెల్లెలు, నానమ్మ, అమ్మ ఇలా ఎవరో ఒకరు పని కోసం బయటకు వెళ్తూనే ఉంటారని.. తాను కూడా సినిమా రంగానికి వచ్చి ఎంటర్ టైన్ చేయాలి అనుకున్నట్టు తెలిపింది. ‘నేను ఎప్పుడూ నా సొంత ప్రపంచంలోనే జీవించాను. ఇలాంటి వాటిని నేను ఊహించలేదు. AIతో నా ఫొటోలను మార్ఫింగ్ చేస్తే అది వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే. నా ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కుంటున్నారు. కాబట్టి మనమంతా AIని ఇలాంటి దుర్వినియోగానికి వాడకుండా మంచి పనులకు వాడుదాం అంటూ తెలిపింది శ్రీలీల. అధికారులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Read Also: చిరు, వెంకీ సాంగ్ ఎలా ఉంటుందో తెలుసా..?
Follow Us On: X(Twitter)


