epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

H1b… టీసీఎస్​, ఇన్ఫోసిస్​ ఉద్యోగులకు గుడ్​న్యూస్​

కలం, వెబ్​డెస్క్​: టీసీఎస్​, ఇన్ఫోసిస్​ తరఫున అమెరికాలో పనిచేస్తున్న హెచ్​1బీ (H1b Visa) ఉద్యోగులకు గుడ్​న్యూస్​. ట్రంప్​ ప్రభుత్వం పెంచిన హెచ్​1బీ వీసా ఫీజు లక్ష డాలర్లను తమ ఉద్యోగుల తరఫున ఈ రెండు సంస్థలు భరించనున్నాయి. ఈ మేరకు టెక్​ దిగ్గజాలు సమాయత్తమవుతున్నట్లు వాటి ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. అయితే, అదే సమయంలో కొత్త ఫీజు భారం తగ్గించుకునేందుకు టెక్​ దిగ్గజాలు హెచ్​1బీ నియామకాలను కొంతమేర తగ్గించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ట్రంప్​ ప్రభుత్వం విధించిన కొత్త ఫీజుపై న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నందున ఇంకా అమల్లోకి రాలేదు. ఒక వారంలో దీనిపై కోర్టులు తుదితీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే తమ ఉద్యోగుల వీసా ఫీజు భరించాలని ఈ టెక్​ దిగ్గజాలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే, అదే సమయంలో హెచ్​1బీ వీసాల సంఖ్యను తగ్గించొచ్చు.

కాగా, ఏటా అమెరికా ఇచ్చే 85వేల హెచ్​1బీ (H1b Visa) వీసాల్లో అధిక భాగం టీసీఎస్​, ఇన్ఫోసిస్​, సీటీఎస్​ సొంతం చేసుకుంటున్నాయి. ఒక నివేదిక ప్రకారం మే 2020 నుంచి మే 2024 మధ్య ఈ సంస్థల తరఫున వచ్చిన హెచ్​1బీ వీసా దరఖాస్తుల్లో 90శాతం ఆమోదం పొందాయి. ఈ మూడు కంపెనీల నుంచి దాదాపు 23వేల మందికి హెచ్​1బీ వీసా ఆమోదం పొందింది. కొత్త ఫీజు అమల్లోకి వస్తే ఈ టెక్​ దిగ్గజాలపై భారీగా భారం పడనుంది. అందుకే హెచ్​1బీ వీసాలను కొంతమేర తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇది భారత్​లోని ప్రతిభ కలిగిన ఉద్యోగులతోపాటు తక్కువ జీతానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునే అమెరికా కంపెనీలకూ ఇబ్బందేనని విశ్లేషకులు అంటున్నారు.

Read Also: ఆ ఊర్లో 69 ఏళ్ల త‌ర్వాత స‌ర్పంచ్‌ ఎన్నిక‌!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>