కలం డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ ప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu). ఈ మూవీని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలు యూట్యూబ్ ని షేక్ చేసి రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతున్నాయి. దీంతో ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఇందులో వెంకీ నటిస్తుండడంతో.. చిరు, వెంకీ(Chiranjeevi – Venkatesh) ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది..? ముఖ్యంగా వీరిద్దరి పై వచ్చే సాంగ్ ఎలా ఉంటుంది..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. దీని గురించి ఓ వార్త లీకైంది.
ఇంతకీ విషయం ఏంటంటే… చిరంజీవి పాత పాటలను, వెంకటేష్ పాత పాటలను రీమిక్స్ చేశారట. వీరిద్దరి పై చిత్రీకరించిన పాటలో ఈ రీమిక్స్ సాంగ్స్ వస్తాయి అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈ సాంగ్.. ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు. చిరు కామెడీ టైమింగ్.. వెంకీ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరికి తోడు కామెడీని అద్భుతంగా తెర పైకి తీసుకువచ్చి వరుసగా సక్సెస్ సాధిస్తున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) తోడవ్వడంతో మన శంకర్ వరప్రసాద్ గారు ఖచ్చితంగా బ్లాక్ బస్టరే అనే టాక్ బలంగా వినిపిస్తుంది.
కొత్త సంవత్సరం కానుకగా చిరు, వెంకీ (Chiranjeevi – Venkatesh)ల సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలో రానుందని సమాచారం. జనవరి 12న మన శంకర్ వరప్రసాద్ గారు భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. మరి.. ఈ క్రేజీ మూవీతో చిరు, వెంకీ, అనిల్ కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
Read Also: అకిరా ఎంట్రీ ఎప్పుడు..? ఎవరితో..?
Follow Us On: X(Twitter)


