సెలబ్రిటీల పెళ్ళి అంటే అంతకు మించిన హాట్ టాపిక్ మరొకటి ఉండదనే చెప్పాలి. తాజాగా టాలీవుడ్ అభిమానులంతా కూడా యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) పెళ్ళి గురించే చర్చించుకుంటున్నారు. అమ్మడు పెళ్ళి పీటలు ఎప్పుడు ఎక్కుతుంది? ఏడడుగుల బంధంలోకి ఎవరితో అడుగు పెడుతుంది? ఇలా చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా తన పెళ్ళిపై శ్రీలీల స్పందించింది. ప్రస్తుతం శ్రీలీల.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ‘మాస్ జాతర(Mass Jathara)’ సినిమాలో మాస్ మహారాజ రవితేజ సరసన నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో శ్రీలీల.. బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తన పెళ్ళి గురించి మాట్లాడింది. తనకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అనేది వివరించింది. తనకు అందంతో పని లేదని స్పష్టం చేసింది.
‘‘నాకు కాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా పర్వాలేదు. కానీ, నన్ను అర్థం చేసుకునే మనసు ఉండాలి. నా సినీ కెరీర్ పట్ల గౌరవంగా ఉండి, ప్రేమతో నన్ను ప్రోత్సహించాలి. సరదాగా ఉండి నిజాయితీ ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తి నా జీవితంలోకి వస్తే తప్పకుండా పెళ్ళి చేసుకుంటా’’ అని శ్రీలీల(Sreeleela) చెప్పింది.
Read Also: నార్త్ ఆఫ్రికాలో ‘డ్రాగన్’ యాక్షన్..

