ప్రశాంత్ నీల్(Prashanth Neel), ఎన్‌టీఆర్(Jr NTR) కాంబోలో తరకెక్కుతున్న సినిమా ‘డ్రాగన్(Dragon)’. ఇది వర్కింగ్ టైటిలే అయినా.. ఇప్పటికే అభిమానులను కట్టిపడేసింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న ‘డ్రాగన్’ ఇప్పుడు విదేశాలపై కన్ను వేసింది. అతి త్వరలో ఈ మూవీ ఫారెన్ షెడ్యూల్స్ స్టార్ట్ కానున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఇప్పటికే లోకేషన్స్ కోసం రెక్కీ చేపట్టిందని, ఇందుకోసం ప్రశాంత్ నీల్ తన టీమ్‌తో కలిసి నార్త్ ఆఫ్రికా దేశం ట్యునీషియా(Tunisia)కి వెళ్లాడు. అక్కడ ‘డ్రాగన్’లో కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్సెస్‌కు సరిపోయే లొకేషన్స్‌ను సెలక్ట్ చేయడం కోసం ప్రశాంత్ అక్కడే వారం రోజుల పాటు ఉండనున్నాడు.
‘డ్రాగన్(Dragon)’ మూవీలో ఎన్‌టీఆర్ క్యారెక్టర్‌కు ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాగ్ ఉంటుందని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో ఎన్‌టీఆర్.. రఫ్ అండ్ రగ్గ్‌డ్ లుక్స్‌లో కనిపిస్తాడని, ఫ్లాష్ బ్యాక్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే యాక్షన్ సీన్స్ కోసం నార్త్ ఆఫ్రికాతో పాటు పలు ఇతరదేశాల్లో కూడా షూటింగ్ చేయడానికి ప్లాన్స్ రెడీ చేస్తున్నాడట ప్రశాంత్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఫ్యాన్స్ అంచనాలను ‘డ్రాగన్’ అందుకుంటుందో లేదో తెలియాలంటే 25 జూన్ 2026 వరకు ఆగాల్సిందే.
Read Also: ‘మాస్ జాతర’కు ఎదురుదెబ్బ.. ట్రైలర్ ఈవెంట్ క్యాన్సిల్..

