నల్గొండ(Nalgonda) జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు శిశువులను అమ్మడానికి సిద్ధమైంది ఓ గిరిజన జంట. తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో గిరిజన దంపతులకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. కాగా, కొంతకాలంగా వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక.. ఇద్దరు పిల్లలను (ఒకరికి మూడు సంవత్సరాలు, మరొకరికి నాలుగు సంవత్సరాలు) విక్రయించారు. దళారుల ద్వారా గుంటూరు జిల్లాలకు చెందిన వారికి ఇద్దరు పిల్లలను రూ.3 లక్షలకు విక్రయించేశారు.
Nalgonda | ఈ క్రమంలోనే చెల్లిని అమ్మొద్దు అంటూ అక్క తల్లిదండ్రులను వేడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు శిశు విక్రయాల దళారుల గుట్టు రట్టు చేశారు. పేద, గిరిజన తండాలను టార్గెట్‌గా చేసుకుని వీరు దందా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని, చిన్నారులను కొన్నవారు ఎవరు అనే అంశంపై కూడా దృష్టి పెట్టామని అధికారులు తెలిపారు.

