బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుఫాను(Cyclone Montha)గా మారింది. దీని ప్రభావం భారీగా ఉండటంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 43 రైళ్లను రద్దు చేసింది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పలు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ తుఫాను కారణంగా రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ రైళ్ల జాబితానూ విడుదల చేసింది. ప్రయాణానికి ముందే ప్రయాణికులు తమ రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రద్దయిన రైళ్లలో విశాఖ-హైదరాబాద్ (గోదావరి ఎక్స్‌ప్రెస్) కూడా ఒకటి.
Read Also: సీజేఐ రేసులో జస్టిస్ సూర్యకాంత్.. !

