కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా సోనియా గాంధీ శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడం వల్ల ఆమెకు ఆస్తమా సమస్య తీవ్రతరం కావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది.
79 ఏళ్ల సోనియా గాంధీ గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలి నెలల్లో సోనియా గాంధీ పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది మార్చిలో అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా ఆమెకు స్వల్ప శస్త్రచికిత్స అవసరం కావడంతో వైద్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

