Mobile Popup Ad
Mobile Popup Ad

సోష‌ల్ మీడియా స్టార్‌ కుర్చీ తాత ఇక లేడు!

క‌లం, వెబ్‌డెస్క్‌: కుర్చీని మ‌డ‌త పెట్టి అనే ఒకే ఒక్క డైలాగ్‌తో సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న మ‌హ్మ‌ద్ పాషా అలియాస్ కుర్చీ తాత (Kurchi Thatha) మృతి చెందారు. బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని కృష్ణ‌కాంత్ పార్క్ స‌మీపంలో ఆయ‌న వాకింగ్ చేస్తూ ఉండ‌గా ఒక్క‌సారిగా గుండెపోటు రావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలి మ‌ర‌ణించారు. ఆయ‌న ఎక్కువ స‌మ‌యం కృష్ణ‌కాంత్ పార్క్ ప‌రిస‌రాల్లోనే గ‌డుపుతూ ఉండే వాడు. ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న స‌ర‌దాగా మాట్లాడిన మాట‌లు రీమిక్స్ సాంగ్‌గా మారి ఇంట‌ర్నెట్‌ను షేక్ చేశాయి. ఆ పాపులారిటీతోనే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో ఆయ‌న డైలాగ్‌తో పెట్టిన సాంగ్ సూప‌ర్ హిట్ అయ్యింది.

ఇక గ‌తంలోనూ కుర్చీ తాత (Kurchi Thatha) చ‌నిపోయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో కొన్ని పుకార్లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో ఆయ‌న వార్త‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయవద్దని వేడుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆయన నిజంగానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో సోషల్ మీడియా అభిమానులు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: రూపాయి ఖర్చు లేకుండా.. సబ్జా గింజలతో పార్లర్ లాంటి గ్లో!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>