Mobile Popup Ad
Mobile Popup Ad

రూపాయి ఖర్చు లేకుండా.. సబ్జా గింజలతో పార్లర్ లాంటి గ్లో!

కలం, వెబ్‌డెస్క్: సబ్జా గింజలు (Sabja Seeds) అనేవి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మూలికా గింజలు. ఇవి శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ముఖ్యంగా శరీర వేడిని తగ్గించేందుకు సబ్జా గింజలు ఉపయోగపడతాయని మనందరికి తెలుసు. కానీ చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయని మీకు తెలుసా? అవును సబ్జాగింజలు చర్మాన్ని లోలోపలి నుంచి మెరిపించేందుకు బాబా ఉపయోగపడతాయని నిపుణుల సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

డీటాక్సిఫికేషన్..

మన ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ ఎన్నో పనులపై బయటికి వెళ్తుంటాం. ఈ సమయంలో వాహనాల నుంచి వెలువడే పొగ, కాలుష్యం కారణంగా.. చర్మం కాంతిని కోల్పోతుంది. దుమ్ము, ధూళి ప్రభావం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చర్మాన్ని లోలోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు అందుకు సరైన ఎంపిక అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయట. దీనివల్ల సౌందర్య సమస్యలు తగ్గి చర్మం మెరుపును సంతరించుకుంటుందని చెబుతున్నారు నిపుణులు.

చర్మం ముడతలు పడకుండా..

చిన్న ఏజ్‌లోనే చాలా మందికి చర్మం ముడతలు పడుతుంటుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అయితే ఇలా కనిపించకుండా ఉండటం కోసం చాలామంది యాంటీ ఏజింగ్ క్రీంలను వాడుతుంటారు. ఈ సమస్యను తగ్గించేందుకు సబ్జా గింజలు కూడా మేలైన పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటితో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందట.

  • చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలిపి ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవాలట. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం ముడతలు తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
జుట్టు సంరక్షణ కోసం..

సబ్జా గింజలు (Sabja Seeds) చర్మానికే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తాయట. దీనిలో ఉండే విటమిన్ ‘కె’, బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయట. రఫ్ హెయిర్ ఉన్నవారు సబ్జా గింజలను ఉపయోగించడం వలన కురులకు పోషణను అందించి మృదువుగా మారేలా చేస్తాయట.

  • 2 చెంచాల సబ్జా గింజల పొడిని అరకప్పు పెరుగు, ఒక చెంచా ఆముదం (Castor Oil) లేదా కొబ్బరి నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టు కుదుళ్లకు పట్టించి 30 నిమిషాల తర్వాత కుంకుడుకాయ లేదా మైల్డ్ షాంపూతో కడిగేయండి. ఇలా చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవి సహజసిద్ధమైనవే అయినా కొంతమందికి పడకపోవచ్చు.. అందువల్ల ఒకసారి వాడి చూసి ఎలాంటి సమస్యలూ లేవనుకున్నప్పుడే.. నిపుణుల సలహాతో కొనసాగించడం మంచిది.

Read Also: జమ్మూలో అనుమానాస్పద డ్రోన్.. ఆర్మీ హై అలర్ట్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>