epaper
Friday, January 30, 2026
spot_img
epaper

కేసీఆర్ ఇంటికి పోలీసుల నోటీసులు

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం నుండి మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు నోటీసులు (SIT Notices KCR) జారీ అయ్యాయి. ఆ నోటీసులను నందినగర్​ లోని ఇంటి గోడకు అతికించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా ఈ నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు రావాలని కేసీఆర్ చేసిన విన్నపాన్ని పోలీసులు తిరస్కరించారు.

అధికారిక రికార్డుల ప్రకారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లోని నందినగర్​ నివాసమే ఆయన ప్రధాన చిరునామా అని, విచారణకు అవసరమైన కీలకమైన ఎలక్ట్రానిక్ ఫిజికల్ రికార్డులను ఎర్రవెల్లికి తరలించడం పరిపాలనాపరంగా కష్టమని పోలీసులు స్పష్టం చేశారు. కేసీఆర్ వయస్సును పరిగణనలోకి తీసుకుని, నిబంధనల ప్రకారం ఆయన నివాసంలోనే విచారణ జరిపేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని ఏసీపీ నోటీసుల్లో ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>